
సినిమాలు

రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మూడు కారవాన్లు ఉపయోగించారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘హమ్జా వ్యాన్’, ‘హమ్జా స్టాఫ్ వ్యాన్’, ‘హమ్జా నార్మల్ వ్యాన్’ అనే పేర్లు క్రెడిట్స్‌లో కనిపించడంతో కొందరు నెటిజన్లు రణ్‌వీర్‌పై విమర్శలు గుప్పించారు.
ఈ వార్తలపై నటుడు గౌరవ్ స్పందిస్తూ వాటిని పూర్తిగా ఖండించారు. దర్శకురాలు ఫరాఖాన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ, షూటింగ్ సమయంలో రణ్వీర్ ఎప్పుడూ అందరితో సరదాగా ఉండేవారని చెప్పారు. ఆయన చాలా ఫ్రెండ్లీ వ్యక్తి అని, సెట్స్‌లో అందరినీ నవ్విస్తూ సందడి చేసేవారని తెలిపారు. దీనిపై స్పందించిన ఫరాఖాన్.. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్వీర్ నటన చూసాక ఐదు కారవాన్లు ఇచ్చినా తప్పు లేదని సరదాగా వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!