

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోఓనర్ కావ్య మారన్‌ల వివాహ రిసెప్షన్ చెన్నైలో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఐటీసీ గ్రాండ్ చోళా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, రజినీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు నూతన దంపతులను ఆశీర్వదించారు. రజినీకాంత్ బ్లాక్ సూట్‌లో, కమల్ హాసన్ సిల్క్ షర్ట్, ధోతీలో కనిపించగా.. సీఎం విజయ్ నేవీ బ్లూ జాకెట్, నల్ల ప్యాంటులో సందడి చేశారు. క్రికెటర్లు కేన్ విలియమ్సన్, డేనియల్ వెటోరీ, డేల్ స్టెయిన్ కూడా ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ఈ నెల 11న కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజినీకాంత్, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. అనంతరం తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను అనిరుధ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ వేడుకకు హాజరై ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రేమ, ఆశీర్వాదాలు తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని, కొత్త జీవిత ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయని పేర్కొన్నారు. తమపై చూపిన అభిమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని కావ్య, అనిరుధ్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!