

నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. కాజల్ మండోదరిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం నవంబర్ 8న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో సాయి పల్లవి సీత లుక్‌పై కొందరు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
సీత పాత్రకు సాయి పల్లవి సరిపోలేదంటూ వస్తున్న విమర్శలపై తమిళ బిగ్‌బాస్ ఫేమ్, నటి జోవికా విజయ్‌కుమార్ స్పందించారు. ఒక నటిగా సాయి పల్లవి గురించి తీర్పు చెప్పే స్థాయిలో తాను లేనని, ఆమె ప్రతిభ గురించి అందరికీ తెలుసని అన్నారు. సినిమా పూర్తిగా చూడకుండానే కేవలం లుక్ ఆధారంగా ఆమె పాత్రకు సరిపోదని నిర్ణయించడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. సాయి పల్లవి నటనపై నమ్మకం ఉంచాలని జోవికా సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!