

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు సమస్యకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సకు గంగా హాస్పిటల్ చీఫ్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. గతంలో చిరంజీవికి క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
రామ్ చరణ్‌కు అత్యుత్తమ చికిత్స అందించేందుకు అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్తో పాటు నిపుణుల బృందం కలిసి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని, నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో చిరంజీవి, సురేఖ, ఉపాసన ఆయనతో పాటు ఉన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!