
సినిమాలు

ప్రముఖ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఎదుర్కొన్న ఆర్థిక కష్టాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పూరి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయన ఎంతో నమ్మిన ఒక వ్యక్తి మోసం చేయడంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. ఆ ఘటన వల్ల పూరి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
‘ఏక్ నిరంజన్’, ‘బంపర్ ఆఫర్’ సినిమాల సమయంలో అప్పులపై నెలకు దాదాపు రూ.50 లక్షల వరకు వడ్డీ చెల్లించాల్సి వచ్చిందని రఘు కుంచె పేర్కొన్నారు. ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న కార్యాలయాన్ని కూడా అప్పులు తీర్చేందుకు విక్రయించాల్సి వచ్చిందని, ఆ తర్వాత అద్దె కార్యాలయం నుంచి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఒక వ్యక్తి చేసిన మోసం వల్ల పూరి జగన్నాథ్ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయని రఘు కుంచె వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!