
గాసిప్స్

టాలీవుడ్ స్టార్ జూ.ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి ఆయనను పరీక్షించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జూ.ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కార్యాలయం స్పష్టం చేశాయి. ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!