
సినిమాలు

స్టార్ రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ఫ్లాప్‌పై స్పందించారు. ఈ సినిమా ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతుండటంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆ చిత్రానికి కథను తానే అందించానని తెలిపారు. దర్శకుడు బి. గోపాల్, హీరో బాలకృష్ణ కథ విన్న తర్వాతే సినిమా ప్రారంభించారని, కథ నచ్చకపోతే గోపాల్ గారు సినిమా చేయరని చెప్పారు.
తర్వాతి దశలో స్క్రీన్‌ప్లే, ఇతర పనులను పరుచూరి బ్రదర్స్ చూసుకున్నారని పోసాని వెల్లడించారు. అయితే సినిమా హిట్ అయితే తానే కథ ఇచ్చానని, ఫ్లాప్ అయితే ఇతరులపై నెట్టేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. పల్నాటి బ్రహ్మనాయుడు ఒక చెత్త కథ అని, ఆ సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని పోసాని నిజాయితీగా ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!