
గాసిప్స్

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘అనకాపల్లి’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2 వేదికపై టాలీవుడ్ థండర్స్ జట్టు సమక్షంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో శ్రీకాంత్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్ తదితరులు ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, తారక్ పొన్నప్ప విలనిజం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచి సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!