

3 ఇడియట్స్ చిత్రం 2009లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ రానుందని వస్తున్న వార్తలపై తాజాగా ఆమిర్ స్పందిస్తూ, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, కథ కూడా విన్నానని తెలిపారు.
‘3 ఇడియట్స్ 2’పై దర్శకుడు హిరాణీ ప్రస్తుతం బిజీగా ఉన్నారని, కథ చాలా అద్భుతంగా ఉందని ఆమిర్ చెప్పారు. స్క్రీన్‌ప్లేలో ఇంకా కొన్ని మార్పులు అవసరమున్నప్పటికీ, మొదటి భాగంలో ఉన్న హాస్యం ఈ సీక్వెల్‌లోనూ కొనసాగుతుందని తెలిపారు. పాత్రల జీవితాల్లో 10 ఏళ్ల తర్వాత జరిగిన పరిణామాలపై ఈ కథ ఆధారపడనుంది. ఈ వార్తతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందినట్లైంది. ఇదిలా ఉండగా, హిరాణీ–ఆమిర్ కాంబినేషన్‌లో PK వంటి హిట్ చిత్రాల తర్వాత, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా రానుందని సమాచారం.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!