

స్టార్ హీరోయిన్ త్రిష 44 ఏళ్ల వయసులో కూడా గ్లామర్‌ను నిలబెట్టుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘విశ్వంభర’, ‘రామ్’ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తూనే, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హాలీవుడ్ ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే వీడియోను షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో 44 ఏళ్ల వయసులోనే మన జీవితంపై పూర్తి అవగాహన వస్తుందని, నిజమైన జీవితం అప్పుడే ప్రారంభమవుతుందని ఓప్రా చెప్పిన మాటలు ఉన్నాయి.
ఈ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని త్రిష క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తి రేపింది. ప్రస్తుతం త్రిష వయసు కూడా 44 కావడంతో, ఆమె ఈ పోస్ట్‌కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె తన జీవిత దృక్పథాన్ని వెల్లడించిందని భావిస్తుండగా, మరికొందరు పెళ్లిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మొత్తానికి త్రిష చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!