

సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయాయి. సాధారణ కమర్షియల్ సినిమాల కంటే వైవిధ్యమైన కథలు, కొత్త తరహా పాత్రలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే ఇలాంటి సాహసోపేత పాత్రలు చేసే నటీనటులు మాత్రం ఇంకా తక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఊహించని పాత్రలో ఆమె కనిపించనుందని టాక్ నడుస్తోంది.
కన్నడలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, తర్వాత తెలుగులోకి వచ్చి మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్డమ్ సంపాదించింది. ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా మరింత పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’ గురించి బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, ఇందులో రష్మిక మరియు కృతి సనన్ స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో ఇలాంటి అంశాలు అప్పుడప్పుడు కనిపిస్తాయి గానీ దక్షిణాదిలో ఇవి అరుదు. ఈ వార్త నిజమైతే తెలుగు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇదిలా ఉండగా, రష్మిక వ్యక్తిగత జీవితంపై కూడా వార్తలు వస్తున్నాయి. వచ్చే వారం ఆమె ప్రియుడు విజయ్ దేవరకొండతో పెళ్లి చేసుకోనుందని ప్రచారం నడుస్తోంది. రాజస్తాన్లో ఈ నెల 26 న డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని, వచ్చే నెల 4 న హైదరాబాద్లో రిసెప్షన్ ఉంటుందని సమాచారం. ఈ వేడుకలకు ఇరువురి కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతారని టాక్.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!