

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సినిమా తుది వెర్షన్‌ను పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వీక్షించినట్లు సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను బలంగా ఆకట్టుకునేలా రూపొందినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాయలసీమ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో చిత్తూరు ప్రాంత సంస్కృతి, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. యాక్షన్, కుటుంబ అనుబంధాలు, ప్రేమ మరియు ఘర్షణలతో కూడిన కథనం ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని సమాచారం. భాగ్యశ్రీ బోర్సేతో అఖిల్ కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో కీలక మలుపు కావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!