

చెన్నైలో పుట్టి పెరిగిన ఓ నటి తెలుగు సినిమాల ద్వారా విస్తృత గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆమె ప్రస్తుతం 30 ఏళ్ల చివరి దశలో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. గతంలో ఆమె ఓ యువ తెలుగు నటుడితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. దాదాపు దశాబ్దం క్రితం వీరిద్దరూ విడిపోయినప్పటికీ, ఆ తర్వాత కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే, ప్రస్తుతం ఆ నటి తన మాజీ ప్రియుడితో పాటు, అతడికి సంబంధించిన స్నేహితుల వర్గానికి కూడా క్రమంగా దూరమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కొంతమంది ప్రముఖ వ్యక్తులకు రాజకీయ సంబంధాలు, వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, వారితో ముడిపడే వివాదాలకు దూరంగా ఉండాలని ఆ నటి భావిస్తున్నట్లు సమాచారం. మాజీ ప్రియుడి ద్వారా హైదరాబాద్లోని పలువురు ప్రముఖులతో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయని, కొన్నేళ్లుగా ఆ వర్గంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ పరిచయాల ద్వారా ఆమెకు కొన్ని మంచి అవకాశాలు కూడా లభించాయని ప్రచారం ఉంది. అయితే, ప్రస్తుతం ఆ పరిచయాల నుంచి ఆమె వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై సదరు నటి నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!