

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లడీ రోమియో’ తొలి షెడ్యూల్‌ను న్యూఢిల్లీలో విజయవంతంగా పూర్తి చేసుకుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డార్క్ యాక్షన్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. సుమారు వారం రోజుల పాటు కొనసాగిన ఢిల్లీ షెడ్యూల్ తాజాగా ముగిసింది. త్వరలోనే హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఢిల్లీ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో లీక్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని దృశ్యాలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు చిత్ర బృందాన్ని కోరుతున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!