

రష్యా ఆధీనంలోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యాతో అనుసంధానించే కీలక కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. మంగళవారం ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. దాడిలో వంతెన ఆర్చ్‌తో పాటు రహదారి విభాగంలోని కొంత భాగం కూలిపోవడంతో రోడ్డు అనుసంధానం తెగిపోయిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రైల్వే ఆర్చ్ కూడా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. రష్యా సైనిక బలగాలు, పౌర సరఫరాలను క్రిమియాకు తరలించడంలో కెర్చ్ వంతెన కీలక పాత్ర పోషిస్తోంది.
మరోవైపు, రష్యాపైకి ఉక్రెయిన్ పంపుతున్న డ్రోన్లను వరుసగా రెండో రోజు కూడా భారీ సంఖ్యలో అడ్డుకున్నట్లు రష్యా ప్రకటించింది. కెర్చ్ వంతెనపై దాడి, డ్రోన్ దాడుల పరిణామాలతో రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యాయి. వ్యూహాత్మకంగా కీలకమైన రవాణా మార్గాలపై దాడులు ఇరు దేశాల సైనిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!