

ఛఠ్ పూజల వేడుకలు ముగిసిన అనంతరం యమునా నది తీర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా షాలిమర్ బాగ్‌లోని మునక్ కెనాల్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా పాల్గొన్నారు. ఆమె నీటిలోకి దిగి చెత్తను తొలగిస్తూ శుభ్రతా కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. నదులు, వాటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.
ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా పాల్గొని తన మద్దతు తెలిపారు. పండుగల అనంతరం నదీ తీరాల్లో పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంతో పాటు, జలవనరుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచగలమనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!