
క్రీడలు

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులు ప్రయాణిస్తున్న కారు లింక్ రోడ్డుకు సమీపంలో అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారందరూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదం కారణంగా కొంతసేపు ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని కారును రోడ్డుపక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించి వాహనాల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!