4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ గెలుపు నాకు ఎంతో ప్రత్యేకం – పీవీ సింధు

Writer: Sreekanth Reddy 12:47 AM, 20 జులై, 2026
ఈ గెలుపు నాకు ఎంతో ప్రత్యేకం –  పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది. ఈ టైటిల్ అందుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన సింధు.. భావోద్వేగానికి గురైంది. కష్టకాలంలో కూడా తనపై నమ్మకం కోల్పోలేదని.. అదే తన విజయానికి కారణమైందని వెల్లడించింది. వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఇదే జోరును కొనసాగించి రికార్డు స్థాయిలో ఆరో పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని స్పష్టం చేసింది. కాగా ఫైనల్ పోరులో జపాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ యమగూచిపై 21-17, 21-17 వరుస సెట్లలో సింధు గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఈ గెలుపు నాకు ఎంతో ప్రత్యేకం. చాలా కాలంగా దీని కోసమే కష్టపడుతున్నాను. గెలిచిన వెంటనే నా కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. గత 19 నెలలుగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాను. చాలా మంది 'ఇక సింధు పని అయిపోయిందా?' అని ప్రశ్నించినా.. నేను మాత్రం నా మీద నమ్మకం కోల్పోలేదు. నేను చేయగలనని ఎప్పుడూ విశ్వసించాను. ఆ నమ్మకమే నన్ను గెలిపించింది. ఈ ప్రయాణంలో నాకు తోడున్న నా కోచ్‌లకు, నా వెన్నంటే ఉన్న తల్లిదండ్రులు, నా భర్త, అత్తమామలకు కృతజ్ఞతలు ’ అని సింధు వెల్లడించింది. 2024 డిసెంబర్‌లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత సింధుకు ఇది తొలి మేజర్ టైటిల్. అలాగే 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తర్వాత ఆమె ఖాతాలో చేరిన అత్యంత ప్రతిష్ఠాత్మక గెలుపు కూడా ఇదే.

ఆగస్టు 17 నుంచి 23 వరకు భారత్ వేదికగా జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు ఈ విజయం తనలో అపార ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సింధు తెలిపింది. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు గెలిచిన ఆమె.. మరో పతకం సాధిస్తే మహిళల సింగిల్స్‌లో ఆరు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనుంది. ‘ఇప్పుడున్న ఆటతీరు, ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని అలాగే కొనసాగించాలి. ఈ విజయానికి ఇదే సరైన సమయం. ఇదే జోరును ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. అటాకింగ్ గేమ్ నా బలం. ఇప్పుడు కోర్టులో స్వేచ్ఛగా కదులుతూ దూకుడుగా ఆడగలుగుతున్నాను. అనవసర తప్పిదాలను తగ్గించగలిగితే మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించవచ్చు. అదే ఈ టోర్నీలో నాకు కలిసొచ్చింది’ అని సింధు వివరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

ట్యాగ్లు
పీవీ సింధుజపాన్ ఓపెన్ సూపర్ విన్నర్స్టార్ బ్యాడ్మింటన్ఛాంఫియన్ షిప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!
జనరల్

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌
క్రీడలు

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు
సినిమాలు

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...
క్రీడలు

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!
జనరల్

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!