
జనరల్

రామాయపట్నం పోర్టు భవితవ్యంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో రాష్ట్రానికి రూ.3,500 కోట్ల ఆర్థిక భారం మిగిల్చడం అభివృద్ధా? లేక భారీ స్కామా? అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. పోర్టు ప్రాజెక్టు నిర్వహణ, ఆర్థిక ప్రభావాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోర్టుల అభివృద్ధి వేగంగా సాగిందని జగన్ పేర్కొన్నారు. మూడు పోర్టుల పనులను వేగవంతం చేయడంతో పాటు భూసేకరణ, అవసరమైన అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజర్ వంటి కీలక ప్రక్రియలను పూర్తి చేశామని తెలిపారు. రామాయపట్నం పోర్టు ద్వారా భారీ పరిశ్రమలను ఆకర్షించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేశామని ఆయన వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!