
జనరల్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు పార్లమెంట్లో 'వందే మాతరం' సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. జాతీయ గీతం 'జనగణమన'కు ఉన్న చట్టబద్ధ రక్షణను వందే మాతరంకూ వర్తింపజేయాలనే ఉద్దేశంతో ఈ సవరణ బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, 1971 జాతీయ గౌరవ చట్టం పరిధిలోకి వందే మాతరం కూడా చేరనుంది.
ప్రతిపాదిత బిల్లు ప్రకారం వందే మాతరంను అవమానించడం లేదా దాని గానాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం నేరంగా పరిగణించే అవకాశం ఉంది. అలాంటి చర్యలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే నిబంధనలను బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!