
జనరల్

అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. కేవలం 85 బంతుల్లోనే 4 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేసిన హిట్‌మ్యాన్ తన అద్భుత ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రాబోయే ఐసీసీ వరల్డ్ కప్‌కు తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను పంపించాడు.
31 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 206 పరుగులు చేసింది. మరోవైపు విరాట్ కోహ్లీ 17 బంతుల్లో 23 పరుగులు చేసి క్రీజులో నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ దూకుడు, కోహ్లీ సహకారంతో భారత్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!