
జనరల్

జూలై 18, 2026 నాటికి లోక్‌సభలో పార్టీల వారీ సభ్యుల తాజా బలాబలాల జాబితాను లోక్‌సభ సెక్రటేరియట్ శనివారం విడుదల చేసింది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సభ్యుల సంఖ్య, పార్టీల స్థానాలను తాజా సమాచారం ప్రకారం నవీకరించింది. ఈ జాబితా ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన 20 మంది ఎంపీలకు లోక్‌సభలో ప్రత్యేకంగా కూర్చునే ఏర్పాట్లు కల్పించింది.

అదేవిధంగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సభ్యులు ఏక్‌నాథ్ షిండే వర్గంలో విలీనమైన అంశానికి పార్లమెంటరీ పరంగా ఆమోదం లభించినట్లు జాబితాలో ప్రతిబింబించింది. లోక్‌సభలో పార్టీల తాజా బలం, సభ్యుల స్థానాలు, సీటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఈ జాబితా అధికారిక ప్రామాణిక పత్రంగా ఉపయోగించబడనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!