4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

Writer: Nithish 06:20 AM, 4 అక్టోబర్, 2026
తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

తెలుగుదనాన్ని, మాతృభాషను కాపాడుకునేందుకు తెలుగువారంతా కంకణబద్ధులు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎన్ని ఆధునిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినా పుస్తకానికి ఉన్న విలువ ఎప్పటికీ తగ్గదని, పుస్తకాల్లో జీవన అనుభవాలు, లోతైన సత్యాలు నిక్షిప్తమై ఉంటాయని అన్నారు. పూర్వీకులు అందించిన విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో కస్తూరి విజయం పబ్లికేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ ఇంక్‌బౌండ్‌ 2.0’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగూరి చిట్టెన్‌రాజు రచించిన ‘అవేమైనా జ్ఞాపకాలా.. మర్చిపోవడానికి?’, డా. ప్రవీణ్‌ యజ్జల రచించిన ‘స్క్రీన్‌ప్లే మాస్టర్‌ - సుకుమార్‌’, ‘అమ్మమ్మ కథల ఖజానా’, ‘గ్రాండ్‌మా గోల్డెన్‌ టేల్స్‌’ పుస్తకాలను ఆవిష్కరించారు.

ఆంగ్ల భాష మాత్రమే గొప్పదనే భావన నుంచి బయటకు రావాలని వెంకయ్య నాయుడు సూచించారు. యాంత్రికంగా మారుతున్న జీవనశైలిలో అందమైన జ్ఞాపకాలను, మానవ సంబంధాల మాధుర్యాన్ని వంగూరి చిట్టెన్‌రాజు తన రచన ద్వారా అందించారని ప్రశంసించారు. ‘స్క్రీన్‌ప్లే మాస్టర్‌ - సుకుమార్‌’ పుస్తకాన్ని తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి చూసే ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్‌’, ‘మిస్సమ్మ’ వంటి చిత్రాలు ప్రస్తుతం ఎక్కడున్నాయని ప్రశ్నించారు. తాను సినిమాలను విమర్శించడం లేదని, మారుతున్న సినిమా ధోరణిపై మాత్రమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కవి, నటుడు తనికెళ్ల భరణి, రచయిత వంశీ రామరాజు, అమెరికాకు చెందిన శ్రీనివాసరావుతో పాటు పలువురు రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు
ట్యాగ్లు
వెంకయ్య నాయుడుతెలుగుదనంమాతృభాషతెలుగు సాహిత్యంపుస్తక ఆవిష్కరణఇంటర్నేషనల్ ఇంక్‌బౌండ్ 2.0తెలుగు సంస్కృతిసాహిత్యంసుకుమార్హైదరాబాద్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!
టెక్నాలజీ

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్