

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి 20 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను ప్రారంభించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్ కలిసి ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ ఈవీ బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి, ఎంపీ కొత్తగా ప్రారంభించిన ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ ఈవీ బస్సులో ప్రయాణించి సర్వీసు ఏర్పాట్లను పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించేందుకు ఈ సర్వీసులను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యంతో పాటు పర్యావరణహితమైన రవాణా సదుపాయాన్ని అందిస్తాయని తెలిపారు. పీఎమ్ ఈ-బస్ సేవల కింద ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 1,000 బస్సులు కేటాయించగా, అందులో విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. విశాఖ–భోగాపురం మధ్య ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ ఈవీ బస్సుల రాకపోకలతో విమానాశ్రయానికి ప్రజా రవాణా అనుసంధానం మరింత బలోపేతం కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!