
జనరల్

రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా గుడి, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కట్టడాలు ఆయా మతాల సంస్కృతులను ప్రతిబింబించడంతో పాటు భారతదేశ వైవిధ్యాన్ని, తెలంగాణలోని గంగా జమునా తెహ్జీబ్ను తెలియజేసేలా ఉండాలని సీఎం సూచించారు. భిన్న సంస్కృతులను అధ్యయనం చేసే గొప్ప కేంద్రాలుగా ఇవి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సమావేశంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీతో పాటు పలువురు అధికారులు, మైనారిటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సమైక్యతకు ఈ ప్రాజెక్ట్ ప్రతీకగా నిలవాలని సీఎం పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!