
క్రీడలు

తమిళనాడుకు చెందిన 51 ఏళ్ల వ్యక్తి తన పట్టుదలతో NEET పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఉద్యోగ బాధ్యతలు, రోజువారీ పనుల మధ్య కూడా తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రెండు గంటల పాటు క్రమం తప్పకుండా చదువుతూ పరీక్షకు సిద్ధమయ్యారు.
ఈ ప్రయాణంలో ఆయన భార్య అందించిన సహకారం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేచి భర్త కోసం తాజా ఆహారం, పానీయాలు సిద్ధం చేస్తూ ప్రోత్సహించేవారు. ఈ దంపతుల కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, వయసు ఎంతైనా కష్టపడితే లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!