

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’పై ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. సినిమాలో మహిళలను తప్పుగా చూపించారని, అశ్లీలతతో పాటు పురుషాధిక్యత ఎక్కువగా ఉందని కొందరు ఆరోపించారు. ఈ విమర్శలపై యశ్ స్పందిస్తూ, తాను ఎప్పుడూ అశ్లీలతను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. సన్నిహిత సన్నివేశాలకు కూడా ఓ హద్దు ఉంటుందని, వాటిని కళాత్మకంగా తెరకెక్కించాల్సిన అవసరం ఉందని అన్నారు.
‘టాక్సిక్’లో యువతకు, వారి తల్లిదండ్రులకు మధ్య ఉన్న ఆలోచనా విధానాల వ్యత్యాసం, పాత నిబంధనలపై యువత ప్రశ్నలు, భావోద్వేగాలను ప్రధానంగా చూపించినట్లు యశ్ తెలిపారు. ‘కేజీఎఫ్’ తర్వాత ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అడ్వాణీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!