

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. లష్కర్-ఎ-తోయిబా కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. భద్రతా సంస్థల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అబిద్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అబిద్‌కు కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రవాద ఘటనలతో సంబంధాలు ఉన్నాయని, స్థానికేతర కార్మికులపై జరిగిన లక్షిత దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ప్రజలంతా ఐక్యంగా సమ్మిళిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!