
సినిమాలు

ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో పైభాగంలో కనిపించే టెక్స్ట్ లోగోలో కీలక మార్పు చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారిగా అక్షరాల డిజైన్‌ను మార్చింది. కొత్త లోగోలో కర్సివ్, ప్రింట్ స్టైల్స్‌ను కలిపి మరింత షార్ప్‌గా, ఆధునికంగా కనిపించేలా రూపొందించారు. అయితే యాప్‌లోని ప్రసిద్ధ రంగుల కెమెరా ఐకాన్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
కొత్త ఫాంట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త డిజైన్‌లో ‘r’ అక్షరం ఆకారం భిన్నంగా ఉండటాన్ని పలువురు నెటిజన్లు గమనించారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ పేరు ‘ఇన్‌స్టాగ్జామ్’లా కనిపిస్తోందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ మార్పుతో ఇన్‌స్టాగ్రామ్ తన బ్రాండ్‌కు స్వల్పమైన కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!