

‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం వరుస తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలో ‘సిగ్మా’ సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే కెరీర్ పరంగా మంచి దశలో ఉన్న ఆమె, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న మతపరమైన ద్వేషపూరిత ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కన్నీళ్లతో ఓ వీడియోను పంచుకున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా పాల్గొని సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ సందర్భంగా తనకు లభించిన ఆదరణకు ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ తర్వాత కొందరు సోషల్ మీడియా యూజర్లు ఆమెను మతపరంగా విమర్శిస్తూ వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారని ఫరియా తెలిపారు. తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ, తన తల్లిదండ్రులు వేర్వేరు మత నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ పరస్పర గౌరవంతో జీవించారని చెప్పారు.
ఫరియా అబ్దుల్లా: తనకు ప్రేమించడం, శాంతి, ఐక్యత కోసం ప్రార్థించడం మాత్రమే తెలుసని అన్నారు. తనను విమర్శిస్తున్న వారిపైనా ద్వేషం పెంచుకోనని, వారి మంచినే కోరుకుంటానని తెలిపారు. చుట్టూ ఉన్న మనుషుల్లో దేవుడిని చూడలేకపోవడం అంటే ఏదో కోల్పోతున్నట్టేనని పేర్కొన్నారు. ఆమె వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఫరియాకు మద్దతు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!