15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

Writer: Harika S 09:28 AM, 15 ఆగస్టు, 2026
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. తొలిసారి అధికారికంగా ఎర్రకోటపై వందేమాతరం ఆలాపన జరగడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందేమాతరం ఆకారంలో మానవహారం, హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కూడా ఆకట్టుకున్నాయి.

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్య్రమని అన్నారు. దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని, ప్రతి భారతీయుడి హృదయం వందేమాతరం నినాదంతో మారుమోగుతోందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశం వేగంగా అభివృద్ధి సాధించిందని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడి తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని తెలిపారు. రక్షణ ఉత్పత్తులు నాలుగు రెట్లు పెరిగాయని, చట్టాల్లో అనేక మార్పులు తీసుకొచ్చామని అన్నారు.

దేశం ఇతర దేశాలపై ఆధారపడకూడదని, స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పేదలకు వేగంగా ఇళ్లు నిర్మించడం, వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదంతో ముందుకు సాగడం, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, రైల్వే విద్యుదీకరణ, మెట్రో రైళ్ల విస్తరణ వంటి అంశాలను ప్రస్తావించారు. సెమీకండక్టర్‌ రంగం, క్రిటికల్‌ మినరల్‌ కారిడార్‌, ఇంధన భద్రత, ఐదు కొత్త న్యూక్లియర్‌ ప్లాంట్లపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. కరోనా, యుద్ధాలు వంటి ఎన్నో సవాళ్లను అధిగమించామని, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించి తీరతామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఇండోనేషియాలో భారీ భూకంపం...

35 ఏళ్లకే రిటైర్ కావాలన్న బెంగళూరు యువకుడు.. ప్లాన్‌పై నెటిజన్ల చర్చ

35 ఏళ్లకే రిటైర్ కావాలన్న బెంగళూరు యువకుడు.. ప్లాన్‌పై నెటిజన్ల చర్చ

51 ఏళ్ల వయసులో NEET క్లియర్.. భార్య సహకారంతో సక్సెస్ సాధించిన వ్యక్తి

51 ఏళ్ల వయసులో NEET క్లియర్.. భార్య సహకారంతో సక్సెస్ సాధించిన వ్యక్తి

10 ఏళ్ల తర్వాత టెక్స్ట్ లోగోను మార్చిన ఇన్‌స్టాగ్రామ్

10 ఏళ్ల తర్వాత టెక్స్ట్ లోగోను మార్చిన ఇన్‌స్టాగ్రామ్

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మార్కో రూబియో

భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మార్కో రూబియో

ట్యాగ్లు
స్వాతంత్య్ర దినోత్సవంనరేంద్ర మోదీఎర్రకోటవందేమాతరంవికసిత్‌ భారత్దేశాభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

ఇండోనేషియాలో భారీ భూకంపం...
జనరల్

ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో
సినిమాలు

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

వామిక గబ్బికి భారీ డిమాండ్!
సినిమాలు

వామిక గబ్బికి భారీ డిమాండ్!

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!
గాసిప్స్

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!
సినిమాలు

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!

ఫౌజీ కోసం ప్రభాస్‌లో ఈ మార్పేంటి!
సినిమాలు

ఫౌజీ కోసం ప్రభాస్‌లో ఈ మార్పేంటి!

తెలంగాణ మట్టివాసనతో వచ్చేస్తున్న శనార్తి!
సినిమాలు

తెలంగాణ మట్టివాసనతో వచ్చేస్తున్న శనార్తి!

మారుతి రాకకు ఎందుకు ఆలస్యం?
గాసిప్స్

మారుతి రాకకు ఎందుకు ఆలస్యం?

విశాల్‌కు మరో షాక్?
సినిమాలు

విశాల్‌కు మరో షాక్?

‘కరుప్పు’ తర్వాత సూర్య ఖాతాలో మరో భారీ విజయం!
సినిమాలు

‘కరుప్పు’ తర్వాత సూర్య ఖాతాలో మరో భారీ విజయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!