

రాయలసీమ ప్రాంతం ఇకపై రక్షణ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రూ.15,803 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక మధ్యతరహా యుద్ధ విమానాల ప్రాజెక్టుకు ఇవాళ భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఏరోనాటికల్ అభివృద్ధి సంస్థ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమిని సేకరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే తొలి ఐదో తరం స్టెల్త్ బహుళ ప్రయోజన యుద్ధ విమానాలను అభివృద్ధి చేయనున్నారు. స్టెల్త్ సాంకేతికత, ద్వంద్వ ఇంజిన్ వ్యవస్థ, సూపర్ క్రూయిజ్ సామర్థ్యాలు ఈ యుద్ధ విమానాల ప్రత్యేకతగా నిలవనున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు అనుబంధ పరిశ్రమల ద్వారా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!