
జనరల్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో తీవ్రంగా గాయపడి ఐదురోజులుగా మృత్యువుతో పోరాడిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) కన్నుమూసింది. ఈ నెల 3న ప్రసాదిత్య మాల్ వద్ద స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో బైక్‌ను మూడుసార్లు ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
మొదట స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కానీ వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ విషాద సమయంలో కూడా ప్రియాంక కుటుంబం ఆమె అవయవాలను దానం చేసి మహత్తర సేవ చేశారు. ఈ ఘటన మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై మరోసారి చర్చకు దారి తీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!