
షోస్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే తల్లులకు, నవజాత శిశువులకు ప్రభుత్వం ‘ఎన్‌టీఆర్ బేబీ కిట్లు’ అందిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే పిల్లలకు అవసరమైన వస్తువులతో కూడిన ఈ కిట్లను అందజేయనున్నారు. ఒక్కో ఎన్‌టీఆర్ బేబీ కిట్ ధర సుమారు రూ.1,400గా ఉండగా, ఈ పథకం ద్వారా ఏటా సుమారు 2.45 లక్షల మంది శిశువులకు ప్రయోజనం చేకూరనుంది.
ఎన్‌టీఆర్ బేబీ కిట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా రూ.51.15 కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు, పుట్టిన వెంటనే శిశువులకు అవసరమైన ప్రాథమిక వస్తువులు అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నవజాత శిశు సంరక్షణ కోసం ప్రసూతి కేంద్రాల నుంచి వైద్య కళాశాలల వరకు ప్రత్యేక సదుపాయాలను కూడా నిర్వహిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!