

మొబైల్ ఫోన్ తెర రక్షణ కవచాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ తెర రక్షణ కవచాలను తప్పనిసరి ధ్రువీకరణ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. భారతీయ ప్రమాణాల సంస్థ ప్రకారం ‘స్మార్ట్‌ఫోన్ల తెర రక్షణ కవచాల’కు ఐఎస్ 19348:2025 ప్రమాణాన్ని నిర్దేశించారు. ఈ నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ తేదీ తర్వాత దేశీయంగా తయారు చేసే లేదా దిగుమతి చేసే తెర రక్షణ కవచాలు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం మార్కెట్లో విక్రయించే తెర రక్షణ కవచాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. నాణ్యతా పరీక్షలు, ధ్రువీకరణ ప్రక్రియకు సంబంధించిన అదనపు ఖర్చులు తయారీ సంస్థలపై పడే అవకాశం ఉండటంతో వాటి ప్రభావం ఉత్పత్తుల ధరలపై కనిపించవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తక్షణ నిషేధం విధించలేదు. తయారీదారులు, దిగుమతిదారులకు కొత్త ప్రమాణాలకు అనుగుణంగా మారేందుకు ఆరు నెలలకు పైగా గడువు ఇచ్చింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!