
రాజకీయాలు

తమిళనాడు ప్రభుత్వ నికర రుణ సమీకరణం ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన 19.04 శాతం తగ్గి దాదాపు రూ.30,021 కోట్లకు చేరిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎన్. మారీ విల్సన్ తెలిపారు. ఆదాయ సమీకరణ పెరగడం, ఆదాయ లీకేజీలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని చెప్పారు. రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 13 శాతం పెరిగి దాదాపు రూ.1,09,104 కోట్లకు చేరగా.. మొత్తం ఆదాయ రాబడులు 8.6 శాతం పెరిగి రూ.1,17,790 కోట్లకు చేరాయని వెల్లడించారు.
ప్రతి నెలా రాష్ట్ర ఆదాయం, రుణ సమీకరణకు సంబంధించిన గణాంకాలను వెల్లడిస్తామని విల్సన్ తెలిపారు. ఆదాయ సమీకరణను మరింత బలోపేతం చేస్తూనే రుణాలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడం కూడా కీలకమని పేర్కొంటూ.. ఒక్క రూపాయి పెట్టుబడి అయినా పెట్టుబడేనని వ్యాఖ్యానించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!