

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ఆయన సతీమణి అంజన యెలవర్తి నాని 17 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. 2009లో నాని సినిమా చూసేందుకు కాలేజీకి బంక్ కొట్టి వెళ్లిన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సినిమా విడుదలైన రోజే మార్నింగ్ షో కూడా పడలేదని తెలిపారు. అప్పుడే సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి తన సినిమాను సరైన సమయంలో విడుదల చేయించుకోవడం ఎంత కష్టమో అర్థమైందని పేర్కొన్నారు.
17 ఏళ్ల తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటానికి కారణం.. ప్రతి సినిమాతో నాని సంపాదించుకున్న నమ్మకమేనని అంజన పేర్కొన్నారు. నాని తన ప్రతి సినిమాను ఓ బిడ్డలా చూసుకున్నాడని, ఆయన సినీ ప్రయాణానికి తాను ప్రత్యక్ష సాక్షినని తెలిపారు. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోలతో తన తొలి అడుగులు వేయబోతున్న నేపథ్యంలో.. ఇక అంతా మంచే జరుగుతుందని, నానికి ఎప్పటికీ తాము అండగా ఉంటామని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!