

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, గణనాథుడి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేసినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలతో తనకు 13 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్‌లో సుమారు 30 వేల మంది పోలీసులను భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, గుంపుల నిర్వహణ కోసం మోహరించినట్లు డీజీపీ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖలతో కలిసి నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని, హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, బాణసంచా వినియోగంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, అధిక శబ్దాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతంగా ఉత్సవాలను నిర్వహించాలని డీజీపీ సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!