
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 25న సాధారణ సెలవు ప్రకటించింది. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
సెప్టెంబర్ 25న ప్రకటించిన సెలవుకు బదులుగా నవంబర్ 14న పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే నవంబర్ 14 రెండో శనివారం అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు పనిచేయనున్నాయి. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జన శోభాయాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!