

మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత సేవలను తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలకు మహారాష్ట్ర సైబర్ విభాగం నోటీసులు జారీ చేసింది. చట్టబద్ధ అనుమతులు లేకుండా బైక్ ట్యాక్సీ సేవలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర రవాణా శాఖ ప్రకారం, ఈ సంస్థలు రాష్ట్ర నిబంధనలు, మోటారు వాహనాల చట్టాన్ని పూర్తిగా పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్ ధృవీకరణ, బీమా భద్రత, మహిళల రక్షణ చర్యలు, అత్యవసర స్పందన వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల ఒక మహిళ మృతి చెందిన ఘటన కూడా ఈ వివాదానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.
ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బైక్ ట్యాక్సీలపై వివాదాలు కొనసాగుతున్నాయి. కేవలం విద్యుత్ ఆధారిత బైక్ ట్యాక్సీలకే అనుమతులు ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. మహారాష్ట్రలో ఈ సేవలు నిజంగానే నిలిపివేస్తే ఇతర రాష్ట్రాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!