
సినిమాలు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున క్రికెటర్ తిలక్ వర్మ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సినీ నటుడు సాయిదుర్గా తేజ్ కూడా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ప్రముఖులకు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తాను నటించిన ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో తిరుమలకు వచ్చినట్లు సాయిదుర్గా తేజ్ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!