
రాజకీయాలు

ఏపీలో మెగా డీఎస్సీ నియామకాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించామని తెలిపారు. టీచర్ల నియామకాలు, బదిలీల్లో పారదర్శకత కోసం గతంలో జెడ్పీ చైర్మన్ల పరిధిలో ఉన్న ప్రక్రియను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా టెట్ నోటిఫికేషన్‌ను పకడ్బందీగా నిర్వహించామని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేసిందని లోకేశ్ తెలిపారు. డీఎస్సీని ప్రభుత్వం ఎంతో బాధ్యతగా నిర్వహించిందని చెప్పారు. డీఎస్సీ జరగకుండా వైసీపీ నేతలు 141 కేసులు వేశారని ఆరోపించారు. అయినప్పటికీ కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!