

వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. డబ్బులు చెల్లించి ఎమ్మెల్యే టికెట్ కొనుకున్నారంటూ తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన మేఘారెడ్డి.. చిన్నారెడ్డి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంత డబ్బు చెల్లించారని ప్రశ్నించారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిలో ఉంటూ పార్టీకి, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం సరికాదని మేఘారెడ్డి అన్నారు. తన పదవి రెన్యువల్ కోసమే చిన్నారెడ్డి పార్టీపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. చిన్నారెడ్డి వ్యవహారశైలిపై క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలో కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వారం రోజుల్లో చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే వేలాది మంది కార్యకర్తలతో గాంధీ భవన్‌ను ముట్టడిస్తానని మేఘారెడ్డి హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!