
సినిమాలు

భారతదేశంలోని విద్యా వ్యవస్థపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో చదువు ఎక్కువగా సర్టిఫికెట్లకే పరిమితమైందని ఆమె అన్నారు. ఉన్నత చదువులు, ప్రత్యేక నైపుణ్యాలను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
విదేశాల్లో ఒక నిర్దిష్ట సబ్జెక్టుపై ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్‌లో యువతకు ఇలాంటి అవకాశాలు పరిమితంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం సర్టిఫికెట్లు ఇవ్వడం కాకుండా నైపుణ్యాలు, ప్రాక్టికల్ లెర్నింగ్‌పై విశ్వవిద్యాలయాలు దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా రాణించేందుకు విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!