
షోస్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోదం తెలిపారు.
కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. దీంతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆయన త్వరలో సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టనున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!