

ప్రముఖ సంస్థ సన్ గ్రూప్ తన కీలక ఉద్యోగులకు ప్రత్యేక కానుకలు అందించినట్లు సమాచారం. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ వేడుకల సందర్భంగా ఉద్యోగులకు బంగారు ఉంగరాలు, బంగారు నాణేలు, కొత్త దుస్తులు, స్వీట్లు బహూకరించినట్లు తెలుస్తోంది. ఈ కానుకలతో పాటు వివాహ రిసెప్షన్ విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా ఉద్యోగులకు అందజేసింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులతో ఈ వేడుకల ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో సన్ గ్రూప్ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఉద్యోగులకు అందించిన బహుమతులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఈ సందర్భంగా నవంబర్ 25న మధ్యాహ్నం 1 గంటకు చెన్నైలోని సన్ టీవీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు. అనిరుధ్, కావ్య వివాహ రిసెప్షన్ వేడుకల్లో భాగంగా ఈ విందును నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బంగారు ఉంగరాలు, నాణేలు, కొత్త దుస్తులు, స్వీట్లు అందించడంతో పాటు ప్రత్యేక విందుకు ఆహ్వానించడం ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది. ఈ కార్యక్రమం ద్వారా సంస్థ ఉద్యోగులందరితో కలిసి వివాహ వేడుకల సంతోషాన్ని పంచుకోనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!