

జాతీయ పతాకం దేశ గర్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిచ్చే శక్తి అని పేర్కొన్నారు. 2022 నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి వికసిత్ భారత్ నిర్మాణంపై తమ ఉమ్మడి నిబద్ధతను చాటాలని మోదీ కోరారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల ధైర్యసాహసాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ కొనియాడారు. 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమం స్వాతంత్య్ర పోరాటానికి కీలక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, కేరళలో వందేమాతరం గీతాన్ని పూర్తిగా పాడబోమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె. మురళీధరన్, కాంగ్రెస్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నిథాన్ తెలిపారు. గతంలో మాదిరిగానే మొదటి రెండు చరణాలనే పాడతామని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!