

బందరు తీరంలో ఏర్పాటు చేసిన మహాగణపతి లడ్డూ వేలంలో రూ.25 లక్షల ధర పలికింది. ఎఫ్‌సీఎస్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గుమ్మడి భవానీ శంకర్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. 630 కిలోల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భవానీ శంకర్‌కు అందించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలంలో సుమారు 600 మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపింది. రూ.63 వేల ప్రారంభ ధరతో వేలం ప్రారంభమైంది. రేపు జరగనున్న వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవానికి భవానీ శంకర్ దంపతులు హాజరుకానున్నారు.
అనంతరం 63 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ఫైర్ జెట్‌ల సహాయంతో నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రాఘవాపూర్‌లోని సరస్వతి ఆలయంలో ప్రతిష్ఠించిన గణేశుడి లడ్డూ ప్రసాదం రూ.36 లక్షలు పలికింది. సదాశివపేటకు చెందిన భక్తుడు చింతల్‌గట్టు వీరన్న ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!