

విజయవాడ రైల్వేస్టేషన్లో నర్సాపూర్ నుంచి చెన్నై వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20678)లోని సీ4 కోచ్‌లో బుధవారం పొగలు వెలువడటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలు సాయంత్రం 5 గంటల సమయంలో విజయవాడ చేరుకున్నప్పుడు సీ4 కోచ్‌లో హాట్ యాక్సిల్‌ను సిబ్బంది గుర్తించారు. వెంటనే రైల్వే సిబ్బంది కోచ్ వద్దకు చేరుకుని సాంకేతిక, భద్రతా బృందాలను అప్రమత్తం చేశారు. తక్షణ చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులకు వేచి ఉండే సౌకర్యం, తాగునీరు, ఆహారం అందించడంతో పాటు సహాయం కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్న వారి కోసం ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రయాణం కొనసాగించకూడదనుకున్న వారికి రిఫండ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు అవసరమైన సహాయక చర్యలు అందిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!