

వెల్కమ్, ఆషికి, ముజ్సే షాదీ కరోగి, హమ్ హైన్ రాహీ ప్యార్ కే వంటి చిత్రాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూశారు. గురువారం సెప్టెంబర్ 24న ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయనకు ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. ఆయన మరణాన్ని బిజినెస్ భాగస్వామి శివమ్ ధ్రువీకరించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మూడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో ముష్తాక్ ఖాన్ సహాయ నటుడిగా, హాస్యనటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వెల్కమ్ చిత్రంలోని ఆయన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. పలు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో నటించిన ఆయనకు 2024 నవంబర్‌లో జరిగిన కిడ్నాప్ ఘటన కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ ఘటనలో ఆయనను ఈవెంట్‌కు ఆహ్వానించి తీసుకెళ్లిన వ్యక్తులు కొన్ని గంటల పాటు బంధించినట్లు ఆయన వెల్లడించారు. ముష్తాక్ ఖాన్ మృతితో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!